ప్రస్తుత డిజిటల్ యుగంలో ల్యాప్‌టప్ ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో భాగంగా మారిపోయింది. వారు ఎక్కడికి వెళ్లినా దాన్ని వెంటపెట్టుకొని వెళ్లడం తప్పని సరి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా దాన్ని కోల్పోయినా, లేదా మీ ల్యాప్‌టాప్‌ను ఎవరైనా దొంగలిస్తే పరిస్థితి ఏంటి. ఫోన్ అయితే దాన్ని కనుగొనడానికి చాలా యాప్స్ ఉన్నాయి మరి ల్యాప్‌టాప్ పోతే.. ఏం చేయాలో తెలీదు కదా.. అయితే ఇక్కడ తెలుసుకుందాం.
నేటి డిజిటల్ ప్రపంచంలో ల్యాప్‌టాప్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఆఫీసు నుండి చదువు వరకు ప్రతిదీ ల్యాప్‌టాప్‌లోనే జరుగుతుంది. ఈ రోజుల్లో, వినోద ప్రపంచం కూడా ఈ పరికరానికే పరిమితం చేయబడింది. ప్రజల ముఖ్యమైన ఫైల్‌లు, డేటా కూడా ఈ ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకుంటున్నారు. కానీ అనుకోకుండా మీ ల్యాప్‌టప్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, లేదా దాన్ని ఎవరైనా దొంగలించినా.. ఇకపై ఈజీగా కనిపెట్టవచ్చు. దాని కోసం మీరు కొన్ని టీప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫైండ్ మై డివైస్‌ను ఆన్ చేసుకోండి
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఫైండ్ మై డివైస్ అనే ప్రత్యేక ఫీచర్‌ను అందించింది. ఈ ఫీచర్ మీ ల్యాప్‌టాప్‌ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది. దీన్ని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచడం ద్వారా మీరు ఈజీగా మీ ల్యాప్‌టాప్‌ను ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఆన్ చేసేందుకు మీరు మీ ల్యాప్‌టాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి. అక్కడ, ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’కి వెళ్లి, ‘ఫైండ్ మై డివైస్’ ఆప్షన్‌ను ఆన్ చేయండి. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, మీరు మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లోని ఫైండ్ మై డివైస్ పేజీకి వెళ్లి మీ మైక్రోసాఫ్ట్ ఖాతాతో లాగిన్ అవ్వవచ్చు. అప్పుడు మీరు మీ ల్యాప్‌టాప్ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు
అయితే, ఈ ఫీచర్‌లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అతిపెద్ద లోపం ఏమిటంటే ఇది మీ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీ ల్యాప్‌టాప్ దొంగిలించబడి, దొంగ దానిని ఆపివేస్తే, ఈ ఫీచర్ పనిచేయదు.
బ్లూటూత్ ట్రాకర్ ఉపయోగించండి
మీ ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే, బ్లూటూత్ ట్రాకర్ కూడా ఒక గొప్ప పరిష్కారం. మీరు మీ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌లు, టైల్, చిపోలో లేదా శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ వంటి చిన్న పరికరాలను ఉంచుకోవచ్చు. ఈ ట్రాకర్లు మీ ల్యాప్‌టాప్ లోకేషన్‌ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడతాయి. మీ బ్యాగ్ పోయినా లేదా దొంగిలించబడినా, ఈ ట్రాకర్ల సహాయంతో మీరు దానిని కనుగొనవచ్చు. వీటిని ల్యాప్‌టాప్‌లో సులభంగా అతికించవచ్చు. మీరు స్టిక్కీ ట్రాకర్ సహాయంతో దాన్ని గుర్తించవచ్చు. ఈ ట్రాకర్‌ను మీ ఫోన్‌కు కనెక్ట్ చేస్తే..యాప్ ద్వారా ల్యాప్‌టాప్ లోకేషన్ మీకు తెలుస్తుంది.




































