పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇది తెలుసుకోండి! లేకపోతే నష్టపోతారు

ఉద్యోగం చేసేవారైనా, బిజినెస్ చేసేవారైనా.. ఏదో ఒక సందర్భంలో పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే బ్యాంకు వాళ్లు ఆఫర్ చేయగానే లోన్ తీసుకోకుండా.. పర్సనల్ లోన్ గురించి కొన్ని విషయాలు ముందే తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా పర్సనల్ లోన్ నిజంగా అవసరమైతేనే తీసుకోవాలి. తీసుకునే లోన్‌కు  కొన్నేళ్ల పాటు వడ్డీతో సహా.. ఈఎమ్‌ఐలు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ కచ్చితంగా అవసరమా కాదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


వడ్డీ రేట్లు

లోన్ తీసుకునే ముందు బ్యాంకు వాటి వడ్డీ రేట్లు చెక్ చేసుకోవాలి. ఎవరు తక్కువ వడ్డీకి లోన్ అందిస్తున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకుంటే మంచిది. లోన్ తీసుకునే ముందు బ్యాంకు మీకు ఎంత వరకూ ఇవ్వగలుగుతుందో తెలుసుకోండి. బ్యాంకు వెబ్‌సైట్‌లో పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్‌లో ఇది తెలుసుకోవచ్చు. లేదా లోన్ ఏజెంట్ ద్వారా తెలుసుకోవచ్చు.

క్రెడిట్ స్కోర్

మీకు వచ్చే  ఆదాయం, మీరు చేసే ట్రాన్సాక్షన్స్, తిరిగి చెల్లించే సామర్థ్యం, క్రెడిట్ స్కోర్ లాంటి అంశాలన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంక్ వాళ్లు లోన్ అమౌంట్ డిసైడ్ చేస్తారు. మీకు లోన్ కావాలని ముందే అనిపించినప్పుడు దానికి తగ్గట్టు క్రెడిట్ స్కోర్ ఉండేలా ముందునుంచే ప్లాన్ చేసుకోవాలి.

ఈఎంఐ

లోన్ తీసుకున్న మొత్తాన్ని గడువు కంటే  ముందే చెల్లించినా ఫైన్ వేస్తుంటాయి కొన్ని సంస్థలు. అలాంటి సంస్థలను ఎంచుకోకపోవడమే మంచిది. లోన్‌కు కట్టే ఈఎమ్‌ఐ అమౌంట్.. మీరు పెట్టుకునే టెన్యువర్‌ను బట్టి మారుతుంటుంది. తక్కువ వ్యవధి ఎంచుకుంటే ఎక్కువ ఈఎమ్‌ఐ కట్టాల్సి ఉంటుంది. కానీ మీపై వడ్డీ భారం తగ్గుతుంది. అదే ఎక్కువ నెలల వ్యవధి ఎంచుకుంటే ఈఎమ్‌ఐ అమౌంట్ తక్కువగా ఉన్నా.. అదనంగా మీరు కట్టే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో  చెక్ చేశాక..

పర్సనల్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా మొత్తం ఆన్‌లైన్ ప్రాసెస్ చేస్తున్నాయి బ్యాంకులు. మీ ఎలిజిబిలిటీ, అమౌంట్ లాంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుని, అప్లై చేసి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే.. డైరెక్ట్‌గా అకౌంట్‌లోకి లోన్ అమౌంట్ వచ్చి చేరుతుంది.

ఇవి వద్దు

అన్నింటికంటే ముఖ్యంగా లోన్ కోసమై నమ్మదగిన బ్యాంకులు లేదా మంచి ఫైనాన్షియల్ సంస్థలను ఎంచుకోవాలి. చిన్న అమౌంట్స్ లో పాకెట్ లోన్స్ ఇచ్చే యాప్స్‌కు దూరంగా ఉండడమే మంచిది. ఇకపోతే పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఎక్కువగా ఉంటే.. బ్యాంకు వాళ్లు ఎక్కువ అమౌంట్‌ను ఆఫర్ చేస్తుంటారు. అయితే వాళ్లు ఇచ్చినదంతా తీసుకోకుండా మీకు ఎంత అవసరమో అంతే లోన్ తీసుకోవడం ద్వారా అనవసరమైన భారం తగ్గుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.