ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త… ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది.ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం ఒకేసారి ఐదు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.


రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒకేసారి ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్‌మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఒక బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. అలాగే వీటితో పాటు అటవీ శాఖలో 13 డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో 3 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
మరోవైపు ఉద్యానవన శాఖలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.మెుత్తం 21 పోస్టులతో 5 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిది.అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానించింది. అంతేకాదు కేటగిరీల వారీగా గడువు తేదీలను ప్రకటించింది.జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్లకు అక్టోబర్ 7వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది.అలాగే డ్రాఫ్ట్స్‌మెన్, ఏఈఈ, హార్టికల్చర్ ఆఫీసర్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 8వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.అర్హులైన అభ్యర్థులు తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.