కింగ్ నాగార్జున 100వ సినిమా గ్రాండ్ లాంచ్ ప్లాన్.. అతిథిగా ఎవరు రానున్నారంటే

అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రం తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్క సినిమా చేసిన కార్తీక్ తన ప్రతిభను నిరూపించుకోవడంతో ఈ నమ్మకంతోనే నాగ్ ఛాన్స్ ఇచ్చారు.


గత కొన్ని నెలలుగా స్టోరీ డిస్కషన్స్ కొనసాగగా, నాగ్ ‘ఓకే’ చెప్పడంతో ఫైనల్‌గా ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితం అయిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. వందో సినిమా కావడంతో ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ జోన్‌లోనే బలమైన కథను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున తన సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు.

మూవీకి 100 నాటౌట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నాగ్ ప్రతి సారి ప్రయోగాలు చేసి వెనకడుగు వేసినప్పుడు, ఫ్యామిలీ-యాక్షన్ జానర్ సినిమాలే ఆయన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించాయి. అందుకే ఈసారి కూడా పూర్తి కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుండి అభిమానులు లాంచ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని మరింత గ్రాండ్‌గా మార్చేందుకు నాగ్.. మెగాస్టార్‌కి ప్రత్యేక ఆహ్వానం అందజేయాలని భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరై క్లాప్ కొట్టే అవకాశం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా వీరిద్దరూ హాజరయితే ఈ లాంచ్ వేడుక టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతుంది. చిరంజీవి నాగార్జునకు మంచి స్నేహితుడు, అలానే ఎన్టీఆర్‌ను తన పెద్ద కొడుకులా చూసుకుంటారు నాగ్. వీరిద్దరు లాంచింగ్ వేడుకకి రావడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వందో సినిమా లాంచ్ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అభిమానులు మాత్రం ఈ వేడుకను ఎపిక్ లెవెల్‌లో చూసేందుకు సిద్ధమవుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.