ఒక సక్సెస్ మూలన పడ్డ ఒక సినిమాకు మళ్లీ తిరిగి ప్రాణం పోసింది. ఒక సినిమా సక్సెస్ ఆ నిర్మాణ సంస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే రీసెంట్ గా రిలీజైన మిరాయ్.
తేజ సజ్జ, మంచు మనోజ్ నటించిన్ ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఆ తర్వాత ఫుల్ టైం సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ వచ్చాడు. ఐతే మాస్ మహరాజ్ రవితేజతో ఈగల్ సినిమాను డైరెక్ట్ చేశాడు కార్తీక్.
ఈగల్ రిజల్ట్ చూశాక..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తీక్ మీద నమ్మకం పెట్టుకుంది. ఐతే ఈగల్ సినిమా ఎందుకో ఆడియన్స్ ని రీచ్ కాలేదు. సినిమా చివర్లో ఈగల్ 2 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అసలు కథ పార్ట్ 2 లో ఉంటుందని అర్థమైంది. కానీ ఈగల్ రిజల్ట్ చూశాక ఆ సినిమా సీక్వెల్ గురించి మర్చిపోయారు. కానీ మిరాయ్ సినిమా సక్సెస్ మళ్లీ ఈగల్ 2 ని డిస్కషన్ లోకి తెచ్చింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ టాలెంట్ ఏంటో మిరాయ్ తో ప్రూవ్ అయ్యింది.
సో అతను అనుకున్న ఈగల్ 2 కూడా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పీపుల్ మీడియా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా ఈగల్ 2 చేయడానికి రెడీ అన్నట్టే ఉన్నారట. ఐతే కార్తీక్ ప్రస్తుతం మిరాయ్ 2 చేయాల్సి ఉంటుంది. ఈగల్ 2 స్టోరీ ఆల్రెడీ అనుకుని ఉండొచ్చు.. మరి ఈ రెండిటిలో ఏది ముందు చేస్తారన్నది చూడాలి. కేవలం మిరాయ్ సక్సెస్ వల్లే మళ్లీ ఈగల్ 2 ప్రస్తావన వచ్చింది. అంతకుముందు ఆ సినిమా సీక్వెల్ గురించి అసలు చర్చలు జరగలేదు.
మిరాయ్ సక్సెస్ జోష్ లో ఈగల్ 2 కూడా..
ఈగల్ 2 మీద రవితేజ కూడా చాలా హోప్స్ తో ఉన్నడట. ఈగల్ సక్సెస్ అయితే వెంటనే ఈగల్ 2 వచ్చేది కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడం వల్ల లైట్ తీసుకున్నారు. కానీ ఈగల్ 1 కన్నా పార్ట్ 2 లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇంకా కథ చాలా బాగుంటుందట. అందుకే మిరాయ్ సక్సెస్ జోష్ లో ఈగల్ 2 కూడా ఉంటుందని అంటున్నారు. ఇది ఓ రకంగా మాస్ రాజా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ న్యూస్ అని చెప్పొచ్చు.
కార్తీక్ నెక్స్ట్ మిరాయ్ 2, ఈగల్ 2 చేయాల్సి ఉంది. ఐతే ఈ రెండు ఉంచుకుని నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నాక కూడా కార్తీక్ తనకు నచ్చిన సినిమాటోగ్రఫీ మాత్రం వదలట్లేదు.
































