సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లు ఇచ్చింది.


ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది కొత్తగా ప్రమోషన్లు ఇచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 50 మంది అధికారులకు లబ్ధి చేకూరిందని తెలిపాయి. త్వరలోనే మరో 100 – 150 మంది అధికారులు ప్రమోషన్లు పొందేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నాయి. 150 అధికారుల ప్రమోషన్ల మార్గాన్ని క్లియర్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.