ఈ యాప్స్ ఉంటే చాలు.. సైబర్ నేరగాళ్లు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు

నేటి కాలంలో నేరాలు మొత్తం సైబర్ విధానంలో సాగుతున్నాయి. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మన ఫోన్లోకి ప్రవేశించి.. మనకు తెలియకుండా ఖాతాలో డబ్బులు లాగేస్తున్నారు.


మన వ్యక్తిగత సమాచారాన్ని అసాంఘిక వేదికల వద్ద పెడతామని బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్టులు చేశామని.. ఫలానా చట్ట వ్యతిరేక పార్సిల్స్ మీకు వచ్చాయని.. మీరు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని.. దానికి తగ్గ సమాచారం మా వద్ద ఉందని.. ఇలా రకరకాల బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఏ స్థాయిలో అవగాహన కల్పించినప్పటికీ దుర్మార్గులు రకరకాల విధానాలలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. వీటికి అడ్డు కట్ట వేయడం మన చేతుల్లోనే ఉంది.

అడ్డుకోవచ్చు

సైబర్ నేరగాళ్లు మన ఫోన్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. దీనికి యాప్ ల ద్వారా రక్షణ కల్పించుకోవచ్చు. కాకపోతే ఆ యాప్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. వాటి ద్వారా మన వ్యక్తిగత భద్రతను ఎలా పటిష్టం చేసుకోవాలో అవగాహన ఉండాలి. సైబర్ నేరాలు దారుణంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని సంరక్షణ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ ఆ యాప్స్ ఏంటి.. ఎలా పనిచేస్తాయంటే..

సంచార్ సాతి యాప్

సైబర్ నేరాలు జరగకుండా అటుకట్ట వేసే అప్లికేషన్ ఇది. సైబర్ నేరాల నుంచి ఎప్పటికప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది. ఇందులో ఎం కవచ్ 2 యాప్ అందుబాటులో ఉంటుంది. ఇది డిజిటల్ గోప్యత ను కాపాడుతూ ఉంటుంది. మన ఫోన్ కు ఎటువంటి సందేశాలు, మెయిల్స్, ప్రమాదకరమైన లింకులు వచ్చినా, ప్రమాదకరమైన యాప్స్ వచ్చినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు మనం వాడుతున్న ఫోన్ లో లోపాలు ఉంటే వెంటనే పసిగడుతుంది. మన ఫోన్ కు అద్భుతమైన స్మార్ట్ భద్రత కల్పిస్తుంది.

పొరపాటున ఫోన్ పోయినా కూడా..

సంచార్ సాతి అప్లికేషన్ ద్వారా ఒకవేళ మన ఫోన్ పొరపాటున పోతే.. దానిని మరొకరు తెరిచే అవకాశం లేకుండా.. బ్లాక్ చేయవచ్చు. అనుమానిత సందేశాలు.. ప్రమాదకరమైన ఎస్ఎంఎస్ఎల్ పై ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఒకవేళ ఫోన్ గనక పోతే సీఈఆర్ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే.. మళ్లీ ఆ ఫోన్ మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మోడల్, ఐఎంఈఐ నెంబర్ తదితర వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రోజుల వ్యవధిలోనే లోకేషన్ గుర్తించి.. ఆ ఫోన్ ను రికవరీ చేసి పోలీసులు మనకు అప్పగిస్తారు. ఈ వెబ్సైట్ లోకి వెళ్లి ఫోన్ బ్లాక్ లేదా అన్ బ్లాక్ కూడా చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.