రాష్ట్రంలోని మహిళలు ఎక్కడికైనా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని, ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు.
కానీ తాడపత్రి నుండి పుట్లూరు మీదుగా గరువు చింతల పల్లెకు వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులోని కండక్టర్ మాత్రం మహిళలకు స్త్రీ పథకం వర్తించబోదని, టిక్కెట్ కు డబ్బులివ్వాల్సిందేనని వసూలు చేస్తున్నారు. మహిళలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలంటే డబ్బులు కట్టాలని కండక్టర్ చెబుతున్నాడంటూ … మహిళలు వాపోతున్నారు. ఇక విధి లేని పరిస్థితిలో టికెట్ ఇచ్చి వెళుతున్నామని అన్నారు. బస్సు వచ్చేదే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే వస్తుందని, ఈ బస్సులో కూడా టికెట్ అడుగుతుండటం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తమకు ఉచితంగా వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, గోపురాజ్ పల్లి, బాలాపురం, పి చింతలపల్లి, పుట్లూరు, నాయకుని పల్లి, నాగిరెడ్డి పల్లి గ్రామాల మహిళలు కోరుతున్నారు.
































