శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ రోజు.. ఏ టికెట్లు విడుదల చేస్తారంటే..?

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తామనుకుంటున్నారు.. డిసెంబర్‌ నెలలో శ్రీవారి దర్శనం కోసం ప్లాన్‌ చేస్తున్నారా?


అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే? డిసెంబర్ నెల దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల షెడ్యూల్‌ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..

డిసెంబర్‌ నెలలో టీటీడీ విడుదల చేయనున్న వివిధ దర్శనాల టికెట్ల వివరాల్లోకి వెళ్తే..
* శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు విడుదల.
* ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
* అంగ ప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్న టీటీడీ.
* అంగ ప్రదక్షిణ టికెట్ల కోసం సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు.
* కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల
* వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల
* డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా 23న ఉదయం 11 గంటలకు విడుదల
* వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల
* డిసెంబర్‌ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల
* తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.