ఎవరికైనా అనారోగ్యం కలిగితే ముందుగా తీసుకువచ్చే పదార్థం బ్రెడ్. బ్రెడ్ తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.. తక్షణ ఎనర్జీ వస్తుంది. . కడుపులో ఇబంది లేకుండా ఉంటుంది.
అందువల్ల దీనిని తినమని వైద్యులు సైతం రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే బ్రెడ్ ను పూర్వకాలంలో తయారు చేసినట్లు చేస్తే.. ఆ బ్రెడ్ ను నిరభ్యంతరంగా తినవచ్చు. అంతేకాకుండా తినడం వల్ల ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా శరీరంలోకి వెళ్తాయి. కానీ నేటి కాలంలో తినే బ్రెడ్ వల్ల కొత్త రోగాలు వస్తాయి. మరి ఇలా ఎందుకు? ఎక్కడ ఈ లోపం? అంటే బ్రెడ్ తయారీలోనే అని చెప్పవచ్చు.. అది ఎలాగంటే?
ఒకప్పుడు ఉదయం మాత్రమే కొందరు బ్రెడ్ ను విక్రయించేవారు. కిరాణం షాపులు.. ఇతర వర్తకాల్లో.. ఇవి కనిపించేవి కావు. అంటే వారు బ్రెడ్ తయారు చేయడంలో శాస్త్రీయ పద్ధతులు పాటించేవారు. దీంతో బ్రెడ్ తయారీకి సమయం పట్టేది. కానీ నేటి కాలంలో మనుషులు పెరిగిపోయారు. బ్రెడ్ అవసరం కూడా పెరిగింది. మరి ఇలాంటప్పుడు చాలావరకు బ్రెడ్లు కావాల్సి ఉంటుంది. అయితే రోజుల తరబడి వెయిట్ చేస్తే వ్యాపారం నష్టం ఉంటుంది.. అని భావించిన కొందరు త్వరగా బ్రెడ్ తయారీ కావడానికి కొన్ని రకాల రసాయనాలను కలుపుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఏ ఆహార పదార్థం అయినా త్వరగా రెడీ కావడానికి కొన్ని రకాల రసాయనాలు వాడుతున్నారు. బ్రెడ్ తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఏ పదార్థమైనా మనకు అనుకూలంగా సమయానికి కావడానికి సోడియం బ్రో మేట్, పొటాషియం బ్రోమేట్, బ్రోమిక్ యాసిడ్ వాటివి కలుపుతూ ఉంటారు. అయితే ఇవి కలిపే విషయం వారు ఎవరికైనా చెబుతారా? ఒకవేళ చెబితే బ్రెడ్ ను ఎవరైనా కొంటారా? మరి అదే మ్యాజిక్.. కానీ రూల్స్ ప్రకారం బ్రెడ్ లో ఎలాంటి పదార్థాలు వాడాలో చెప్పాలి? అయితే తెలివిగా Flour Improver అని రాస్తారు. అంటే చెప్పకనే చెప్పినట్లు. అంతేకాకుండా ఈ పదార్థాలు త్వరగా రెడీ చేయడానికి పై వాటిని వాడుతూనే.. ఎక్కువ కాలం పాడైపోకుండా ఉండడానికి Preservatives కలుపుతారు.
వాస్తవానికి బ్రెడ్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యం. కానీ బ్రెడ్ లో ఇలాంటి ఆహార పదార్థాలను కలిపితే మరి ఎలా? అసలు ఎలాంటి బ్రెడ్ తీసుకోవాలి? కొందరు మీ ప్రశ్న అడిగితే Whole wheat బ్రెడ్ బెస్ట్ అని చెబుతారు. అయితే ఇందులో కూడా మైదా ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అయితే మరి బ్రెడ్ తినవద్దా ? అని మరికొందరికి సందేహం రావచ్చు. వీటికంటే ప్రత్యామ్నాయం ఎన్నో రకాలుగా ఆహార పదార్థాలు ఉన్నాయి. అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ లేదా ఇంట్లో తయారుచేసిన పదార్థాలను తీసుకువెళ్లడం మంచిది. బయట దొరికే ప్రాసెస్ ఫుడ్, ఇతర ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఇకనుంచి బ్రెడ్ తీసుకుపోవడం పై ఆలోచించండి. ఎందుకంటే వారికి హెల్తీ ఫుడ్ కంటే.. కెమికల్ ఫుడ్ ఇస్తున్నారని గుర్తించాలి.
































