భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) “ఓజీ” (They Call Him OG) సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది.
సెప్టెంబర్ 25, 2025న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా మేకర్స్ వరుసగా క్యారెక్టర్ పోస్టర్స్‌ను విడుదల చేస్తూ సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. నిన్న అర్జున్ దాస్ లుక్ రిలీజ్ కాగా, ఈరోజు ప్రకాష్ రాజ్ లుక్ (సత్య దాదా)ను విడుదల చేశారు. వచ్చే రోజుల్లో మరిన్ని పాత్రల లుక్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులకు పక్కా థియేట్రికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ స్క్రీన్ ఎంట్రీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీపై అభిమానులు ఫిదా అయిపోయారు.

OG Trailer
సినిమా రిలీజ్‌కు వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అభిమానులు ఇప్పుడు OG ట్రైలర్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ట్రైలర్‌కు సంబంధించిన అధికారిక అప్డేట్ రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో హైప్ ఉన్న OG ట్రైలర్ తో మరింత హంగామా చేసే అవకాశముంది.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ కొత్త గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించబోతున్న OG సినిమా అభిమానులు మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. OG ట్రైలర్ తో సినిమాకు బూస్ట్ రానుంది.