ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అతిపెద్ద వార్షిక సేల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ నెల 23 నుంచి మొదలుకానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సులు సహా చాలా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ప్రైమ్ మెంబర్లకు ఈ ఆఫర్లు ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ 13పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
జనవరిలో కంపెనీ తన ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13ను రూ.69,999 ధరకు విడుదల చేసింది. అయితే ఈ సేల్‌లో అదే మోడల్‌ను కేవలం రూ.57,999కు పొందొచ్చని అమెజాన్ తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లభించే డిస్కౌంట్‌తో కలుపుకొని ఈ ధరకు అందించనున్నట్లు వెల్లడించిది. కేవలం వన్‌ప్లస్ 13 కాకుండా ఇతర మోడళ్లపైనా డిస్కౌంట్ పొందొచ్చు. కొన్ని వారాల క్రితం రూ.54,999 ధరకు విడుదలైన వన్‌ప్లస్ 13ఎస్‌ను సేల్‌లో రూ.47,999కు కొనుగోలు చేయొచ్చు. అలాగే వన్‌ప్లస్ నార్డ్ 5 రూ.28,749, నార్డ్ 4 రూ.25,499, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ రూ.15,999, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రూ.18,499కు లభిస్తుంది. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లతో కలుపుకొని ఈ ధరకు లభిస్తాయి.
































