ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ – వాట్సాప్‌లో కూడా ఆ సేవలు పొందవచ్చు

పీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులు కార్డులను అందుకుంటున్నారు. ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని ఇటీవలనే పౌరసరఫరాల శాఖ తెలిపింది.


తీసుకున్న కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా మార్పులు చేర్పులు చేయించుకోవాల్సిన వారు ఉంటే అక్టోబర్ 31 వ తేదీ వరకు చేసుకోవాలని స్పష్టం చేశారు.

స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే సంబంధిత సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకునే వీలుందని అధికారులు సూచించారు.

ఇక మార్పులు చేర్పుల కోసం మనమిత్ర వాట్సాప్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన…. మన మిత్ర 9552300009 వాట్సాప్ నెంబర్ ను సంప్రదించాలి.

మనమిత్ర వాట్సాప్ లో పౌరసరఫరాల సేవను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి మీకు కావాల్సిన సేవను పొందవచ్చు. రేషన్ కార్టులో తప్పులు సవరణకు సంబంధించిన ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పెట్టుకోవచ్చు.

అయితే స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకునే వీలుందని అధికారులు సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

అయితే ఈ మార్పులు చేర్పులు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈలోపే దరఖాస్తు పెట్టుకోవాలి. మీరు సమర్పించే వివరాల ఆధారంగా అప్డేట్ చేస్తారు.

అప్డేట్ చేసే కార్డులను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కాబట్టి తప్పులు ఉన్న వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది. కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే… మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి రేషన్ సరుకులను సకాలంలో తీసుకోవటం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.