మెదడును తినేస్తున్న అతి భయంకరమైన వైరస్.. 19 మంది మృతి.. ఏపీ, తెలంగాణకు హై అలర్ట్..?

మెదడును తినే భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 61 మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. నిల్వ ఉన్న నీటి ద్వారా ఈ మెదడును తినే నెగ్లేరియా ఫౌలెరి అమీబా అనే అరుదైన వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్యులు గుర్తించారు.


ఈ మేరకు ప్రజలు బయట నీళ్లలో ముఖ్యంగా చెరువులు, కాలువలు, కుంటలు, సరస్సుల్లో స్నానాలు చేయోద్దని హెచ్చరికలు జారీ చేశారు.

అరుదైన వ్యాధులకు అడ్డాగా కేరళ రాష్ట్రం మారుతోంది. గతంలో నిఫా వైరస్ ఆ తర్వాత కొవిడ్-19 తొలి కేసు కూడా కేరళలోనే నమోదైంది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా.. ఇలా వరుస వైరస్ లు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ప్రైమరీ అమోబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (పామ్) ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య 69 కు చేరింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యాధి చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరిలోనూ బయటపడుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో మూడు నెలల శిశువుతోపాటుగా 52 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేదని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోని అపరిశుభ్రమైన చెరువులు, కుంటలు, సరస్సులు వద్ద స్నానం చేస్తే.. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా మెదడును తినేస్తుంది.

ఈ అంశంపై కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కేరళ ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కుంటోందని తెలిపారు. ఇంతకుముందు కోజికోజ్, మలప్పురం జిల్లాలకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్రమంతటా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మూడు నెలల చిన్నారుల నుంచి 91 ఏళ్ల వృద్ధులు ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో ఉన్నట్లు తెలిపారు.

అమోబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (పామ్) లక్షణాలు చూస్తే తలనొప్పి, జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులు, వికారం సాధారణ ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. సమయం గడుస్తున్న కొద్దీ మెడ బిగుసుకుపోవడం, ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్లడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఇదంతా ఒక వారం రోజుల వ్యవధిలోనే జరుగుతుంది. వారంలోగా ఈ వ్యాధి బారిన పడిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది.

అమోబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (పామ్) 2016 లో కేరళలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత 2023 వరకు కేవలం 8 కేసులు మాత్రమే బయటపడ్డాయి. కానీ గతేడాది మాత్రం ఏకంకా 36 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 69 కేసులు నమోదయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది 100 శాతం కేసుల పెరుగుదలగా వైద్యులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.