ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ అప్రెంటిషిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 281 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు వివిధ ట్రేడు (డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్))ల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • చిత్తూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 48
  • తిరుపతి జిల్లాలో ఖాళీల సంఖ్య: 88
  • నెల్లూరు జిల్లాలో ఖాళీల సంఖ్య: 91
  • ప్రకాశం జిల్లాలో ఖాళీల సంఖ్య: 54

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 4, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.118 చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాత ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌ నుంచి నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఈ కింది కింది చిరునామాకు పంపించవల్సి ఉంటుంది. ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను అక్టోబర్ 6, 2025వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి, ఆపై ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తును పంపవలసిన చిరునామా ఇదే..

ప్రిన్సిపల్‌, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజి, కాకుటూర్‌, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.