బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రంలో నాలుగురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

భారీ వర్షాలతో అటు ఉత్తర భారతం.. ఇటు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.


ఈ సమయంలో ఏపీ ప్రజలకు వైజాగ్ వెదర్ మ్యాన్ (Vizag Weather Man) పిడుగులాంటి వార్త చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో సెప్టెంబర్ 24 నుంచి 27వ తేదీ వరకూ ఉత్తరకోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ అల్పపీడనం క్రమంగా తీవ్రరూపం దాల్చి.. సెప్టెంబర్ 26వ తేదీన తీరాన్ని తాకవచ్చని, తీరాన్ని తాకేముందు వాయుగుండంగా కూడా మారవచ్చని అంచనా వేశారు. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక తెలంగాణలో నేటి సాయంత్రం నుంచి సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లో రెండు మూడు రోజులుగా సాయంత్రం కాగానే భారీ వర్షం కురుస్తోంది. నేడు కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకూ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.