పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం OG. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది.
హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలంవారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
కాగా ఈ సినిమాను ఒక రోజు ముందుగా అంటే 24న ఆంధ్రాలో ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీమియార్స్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. రూ .1000 టికెట్ ధరను పెంచగా ఇది కాస్త విమర్శలకు తావిస్తోంది. ఆ సంగతి ఆలా ఉంచితే నైజాం ప్రీమియర్స్ షోస్ పై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నైజాంలో ప్రీమియర్స్ కు బెన్ఫిట్ షోస్ ను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు నైజాం ప్రీమియార్స్ ఉంటాయా ఉండవా అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే రిలీజ్ రోజు నాడు తెల్లవారుజామున 1 AM, 4 AM షోస్ పై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది. స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతులు ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
































