విద్యార్థులకు జాక్‌పాట్‌.. ఈ రోజు నుంచే స్కూళ్లకు 16 రోజుల సెలవులు

 పాఠశాలలకు భారీగా సెలవులు వస్తుండడంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా వరుసగా పండుగలతో పెద్ద ఎత్తున విద్యార్థులకు సెలవులు వచ్చేశాయి.


సెప్టెంబర్‌లో ఊహించనన్ని సెలవులు విద్యార్థులకు వచ్చేశాయి. భారతదేశం అంతటా చాలా పాఠశాలలకు దాదాపు రెండు వారాలకు పైగా సెలవులు వచ్చాయి. తాజాగా నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. సుదీర్ఘంగా 16 రోజుల పాటు సెలవులు పాఠశాలలకు ఇచ్చారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో బతుకమ్మ, దసరా పండుగలకు భారీ ఎత్తున సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ అన్ని స్కూళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించారు. కాగా కర్ణాటకలో మాత్రం దేశంలోనే అత్యధికంగా 16 రోజుల సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం నుంచే దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాలలో కొంత ఆలస్యంగా దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

కర్ణాటక దసరా సెలవులు షురూ
దేశంలోనే కర్ణాటకలో భారీగా దసరా సెలవులు వచ్చాయి. కర్ణాటకలో పాఠశాలలకు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ పాఠశాలలకన్నింటికి వర్తిస్తాయి.

తెలంగాణ దసరా సెలవులు
దేశంలోనే.. ప్రపంచంలోనే పూలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మతోపాటు దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు ప్రభుత్వం 13 రోజులు సెలవులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే ఈ సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు. ఈ సెలవులు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయి. ఇదే స్థాయిలో కళాశాలలకు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో..
ఉపాధ్యాయుల అభ్యర్థనల అనంతరం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల సెలవులపై కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను సవరించి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. మొత్తం దసరా పండుగ సెలవులు 12 రోజులు ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.