గోల్డ్ కొనడం ఇకపై కలగానే మిగిలేలా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీగా ధర పెరుగుతూ షాకిస్తోంది బంగారం. తులం గోల్డ్ ధర ఇప్పటికే రూ. లక్షా 12 వేలు దాటింది.
సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయేలా ఉంది. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 820 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,215, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,280 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగింది.
దీంతో రూ.1,02,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగింది. దీంతో రూ. 1,12,150 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,300 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,45,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
































