చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు రూ.3.50 లక్షలకే వస్తోంది.. 33 కి.మీ మైలేజ్‌తో అదరగొడుతుంది

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఆటోమొబైల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. చాలా వాహన తయారీ కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు వరుసగా ప్రకటనలు చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కంపెనీ తన అత్యధికంగా అమ్ముడయ్యే, డిమాండ్ ఉన్న మోడళ్లపై గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనంగా ఉన్న ఎస్-ప్రెస్సో ధరలో పెద్ద తగ్గింపును కంపెనీ అమలు చేయబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే ఫస్ట్ టైమ్ బయ్యర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు మరింత సరసమైన ధరకే లభించనుంది. ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ ధర రూ.76,000 వరకు తగ్గింది. దాంతో ఈ కారు కొత్త ధర రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది నిజంగా బడ్జెట్ కార్లలో ఒక గేమ్ ఛేంజర్ అన్నట్లే. అంతేకాకుండా, టాప్ వేరియంట్ ధరలో కూడా గరిష్టంగా రూ.1,29,600 తగ్గింపు లభిస్తుంది.

ఈ స్థాయి తగ్గింపు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని చెప్పొచ్చు. ధరల విషయంలో వచ్చిన భారీ తగ్గింపు కస్టమర్లను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ కేటగిరీ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో, ఎస్-ప్రెస్సో ధర తగ్గింపు కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఫస్ట్ టైమ్ బయ్యర్స్, కాలేజీ స్టూడెంట్స్ లేదా చిన్న ఫ్యామిలీ కోసం కాంపాక్ట్ కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఆప్షన్ అవుతుంది.

జీఎస్టీ తగ్గింపు ప్రభావం వల్ల ఒక్క ఎస్-ప్రెస్సో మాత్రమే కాకుండా, ఇతర మోడళ్లపై కూడా ప్రయోజనం పొందబోతున్నారు. అయితే ఎస్-ప్రెస్సో ప్రత్యేకత ఏమిటంటే, ఇదే ఇప్పటికే మార్కెట్లో అత్యంత సరసమైన కార్లలో ఒకటి కావడం. కొత్త ధరలతో ఇది మరింత సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఇది ఒక మినీ SUV లుక్ కలిగిన చిన్న కారు. బడ్జెట్ ధరతో పాటు ఎక్కువ మైలేజీ ఇస్తుందనే నమ్మకం దీనికి బలంగా ఉంది.

రాబోయే పండుగ సీజన్‌లో ఈ కారు అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.4.26 లక్షలుగా ఉంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో చిన్న కారు అయినా, దానిలోని ఇంజిన్ మాత్రం తక్కువ కాదు. ఇందులో అమర్చిన 1.0-లీటర్, 3-సిలిండర్ల K10C పెట్రోల్ ఇంజిన్ ఈ కారు పెర్ఫామెన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుంది.

చిన్న సైజ్ కారు కావడం వల్ల నగర రోడ్లలో సులభంగా డ్రైవ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌గా ఉంటే, అదే సమయంలో హైవేల్లో కూడా స్మూత్ డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఇంజిన్‌ను కంపెనీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో జత చేసింది. పవర్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 66 bhp శక్తి, 89 Nm టార్క్ ఇస్తుంది.

మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.76 kmpl మైలేజీ ఇస్తే, ఆటోమేటిక్ 25.3 kmpl వరకు అందిస్తుంది. పెట్రోల్‌తో పాటు CNG కూడా అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌లో ఇంజిన్ 5,300 rpm వద్ద 56.69 bhp పవర్, 3,400 rpm వద్ద 82.1 Nm టార్క్ ఇస్తుంది. అయితే, CNG మోడల్‌లో ఒకే ఆప్షన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది. ఇది గరిష్టంగా 32.73 కి.మీ ప్రయాణం చేయగలదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.