సాధారణంగా కొన్నిసార్లు పాదాల్లో వాపు రావడం సహజం. ఈ సమస్యకి కారణం ఎక్కువ సేపు నిలబడటం, నడవడం, కూర్చోవడం కావచ్చు. ఈ సమస్య గర్భిణీల్లో ఎక్కువగా వస్తుంది.
కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్నిటిప్స్ పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌గా నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఈ వాపు సమస్య నుంచు ఉపశమనం పొందవచ్చు. నీరు ఎక్కువగా తీసుకుంటే పాదాల్లో నిలిచిపోయిన నీరు కూడా పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది.

పాదాల వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు. ఐస్‌ని కాటన్ క్లాత్‌లో చుట్టి పాదాల్లో వాపు ఉన్న చోట ఒత్తుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో ఉండే వాపులు, నొప్పులు పూర్తిగా దూరం అవుతాయని చెబుతున్నారు వైద్యులు, నిపుణులు.
తరచు నిమ్మరసం తగిన కూడా పాదాల్లో వాపుని తగ్గించవచ్చు. శరీరంలోని ట్యాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించడానికి నిమ్మరసం చక్కని ఔషధంలా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని తాగితే పాదాల వాపు చాలా వరకు కంట్రోల్ అవుతుంది.