దసరాకు ఇవి కూడా ఇవ్వకపోతే..! ఉద్యోగులకు ఏపీ జేఏసీ కీలక పిలుపు

పీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రధాన సమస్యల పరిష్కారం జరగకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఇవాళ తెలిపారు.


ముఖ్యంగా ఆర్ధిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని వారు తప్పుబట్టారు. దీనిపై ఉద్యోగులు అంతా ఏకమై నిరసనలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.

ఇవాళ విజయవాడలోని రెవెన్యూ భవన్ లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సమన్వయ సమావేశంలో నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నందున వారంతా న్యాయమైన డిమాండ్లు సాదన కోసం సంఘాలన్నీ బలోపేతం చేసుకని సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు,పెన్షర్లలకు చెల్లించాల్సిన బకాయిలు సూమారు 30వేల కోట్లుకు చేరుకున్నట్లు వారు తెలిపారు.

అంతే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపులు జరగకుండానే చనిపోతున్న పరిస్దితులు వస్తున్నా సరే కనీసం ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా బాధాకరమన్నారు. భవిష్యత్ లోనైనా సరే రిటైర్డు ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా రిటైర్ అయిన రోజే ఉద్యోగికి చెల్లించాల్సి గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ డబ్బులు చెల్లించేలా చూడాలని, ఉద్యోగుల అవసరాలకోసం పెట్టుకున్న సరండర్ లీవులు డబ్బులు చెల్లించాలని కోరారు.

అనారోగ్యంలో ఆసుపత్రులకు వెళ్లితే ఈహెచ్ఎస్ ఎందుకూ పనికిరాకుండా పోతోందని, కొంతమంది ఉద్యోగులు, పెన్షర్లు చనిపోతున్నారని తెలిపారు. కాబట్టి ఉద్యోగులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించకపోతే తమపై వస్తున్న ఒత్తిడి మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకోక ముందే, గత నెల 20వ తేదీన సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

దసరా పండుగ కానుకగా కనీసం డీఏ లు, పెన్షనర్ల బకాయిలు, పిఆర్సీ కమిషనర్ నియామకం జరపాలని వారు కోరారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిల గురించి, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఇంకా పెండింగులో ఉంచిన ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతుల జిఓ వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రభుత్వ స్కీములు వర్తింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తీర్మానం చేశారు.

రెండు నెలల్లో ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ సంఘాలన్నీ రానున్న రెండు మాసాల్లో అంటే నవంబర్ 30 నాటికి వారి రాష్ట్ర సంఘాల సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా, డివిజన్ స్థాయి కమిటీల్లో వారి సంఘాల ప్రాతినిధ్యం ఉండేలా తప్పక చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపి జేఏసి అమరావతి కి అనుబంధంగా ఉన్న ఆయా డిపార్టుమెంట్ సంఘాలు రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు వెంటనే స్పందించి సమావేశాలు నిర్వహించి, సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.