డీఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులకు బిగ్ అప్డేట్. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల జారీ ముహూర్తం ఖరారైంది.
మొత్తంగా 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ప్రకటించారు. ఎంపికైన వారికి ఈ నెల 25న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వీరికి దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి… ఆ తరువాత విధుల్లో చేరేలా కార్యాచరణ ఖరారు చేసారు. డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ పై ఏపీ విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది.
మెగా డీఎస్సీలో ఎంపికైన వారిని ఖరారు చేసారు. వారికి ఈ నెల 25న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్నయించింది. 25వ తేదీన సభ నిర్వహించి.. అక్కడే ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అమరావతితో సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను మరోసారి అధికారులు నిశితంగా పరిశీలన చేసి.. అనంతరం తుది జాబితాలు ప్రకటించారు. 25న వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నారు.
వాస్తవంగా ఈ నెల 19వ తేదీన అర్హులైన అభ్యర్ధులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందు కోసం పలు ప్రాంతాల నుంచి ఎంపికైన అభ్యర్ధులు బయల్దేరారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 25న అప్పాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న వారికి వెంటనే శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. సెలవుల్లో శిక్షణ పైన అభ్యంతరాలు వస్తే ఆ తరువాత ట్రైనింగ్ పూర్తి చేయాలనే మరో ప్రతిపాదన సిద్దం చేసారు. దసరా సెలవుల తరువాత ఆక్టోబర్ 3వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే కొత్తగా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందించనున్నారు.
































