మీ ఐటీఆర్(ITR) రిఫండ్ ఆలస్యమైందా ? కారణమేంటో తెలుసా?

సెప్టెంబర్ 16వ తేదీతో ఈ ఏడాది ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. దీంతో ఐటీఆర్ ఫైల్ చేసిన ఎంతో మంది రిఫండ్ కోసం వేచి చూస్తున్నారు.అయితే ఐటీ రిఫండ్‌ రావడానికి ఎంత సమయం పడుతుంది?


ఆలస్యం కావడానికి కారణమేంటి అనే విషయం తెలుసుకుందాం!

ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత, ఇ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తైతే రిఫండ్ ప్రాసెస్ జరుగుతుంది. కొంత మందికి కేవలం ఒకే రోజులో రింఫండ్ డబ్బులు వచ్చాయని చెబుతున్నారు. తక్కువ అమౌంట్ ఉన్నవారికి ఇలా జరిగినట్లు పేర్కొన్నారు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(1)ప్రకారం, మీ ఐటీఆర్‌ను సమీక్ష చేసిన తర్వాత రిఫండ్ ప్రాసెస్ జరుగుతుంది. తక్కువ అమౌంట్‌ ఉంటే రీఫండ్ త్వరగా జరుగుతుంది. ఈ ఏడాది, టాక్స్ పేయర్స్ క్లెయిమ్ చేసిన డిడక్షన్స్,మినహాయింపులపై మెరుగైన పరిశీలన వలన రీఫండ్‌ ప్రాసెస్‌లో స్వల్ప జాప్యం ఏర్పడవచ్చు.

రీఫండ్ ఎందుకు ఆలస్యం కావచ్చు !
మూలధన లాభాలు లేదా బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయం విషయంలో రీఫండ్ ప్రాసెస్‌లో జాప్యం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఆదాయపు పన్ను శాఖ వారు క్రాస్-వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, కొన్ని సందర్భాల్లో రీఫండ్ కేవలం వారం రోజుల్లోనే క్రెడిట్ అవుతుంది.

రీఫండ్ అమౌంట్‌ విషయంలో లిమిట్ ఏం లేదు !
రీఫండ్ అమౌంట్ విషయంలో ఏ విధమైన గరిష్ట పరిమితి లేదు. టాక్స్ పేయర్స్ TDS, అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్-అసెస్‌మెంట్ ద్వారా చెల్లించిన పూర్తి అదనపు పన్నును తిరిగి పొందేందుకు అర్హులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.