రేపు అన్నీ బ్యాంకులకు సెలవు.. ఎక్కడ, ఎందుకో తెలుసా?

ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్తున్నారా? ఒక్క నిమిషం. రేపు అన్నీ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే పండుగ మూడ్‌లో వెళ్లిన ప్రజలు, ఉద్యోగులకు అకస్మాత్తుగా బ్యాంకులకు సెలవు లభించడం గమనార్హం.


ఈ వారంలో మొత్తం నాలుగు రోజుల సెలవులు వచ్చాయి. వారాంతపు సెలవులతో సహా అదనంగా రెండు సెలవులు వచ్చాయి. జైపూర్‌లో సోమవారం బ్యాంకులకు సెలవు ప్రకటించగా.. రేపు మంగళవారం జమ్మూ శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో సహా భారతదేశం అంతటా ఉన్న అన్నీ బ్యాంకులు నాలుగో శనివారంతోపాటు ఆదివారం కూడా సెలవు ఉండనున్నాయి. సెప్టెంబర్ 27, 28వ తేదీల్లో నాలుగో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. ఆ రెండు రోజులు బ్యాంకులు మూసివేసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవు జాబితాలో ఇవి ఉన్నాయి. ఇక స్థానిక సంప్రదాయాలు, పండుగలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు సెలవు ఇచ్చుకునే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం హిందువులలో నవరాత్రి వేడుకల ప్రారంభాన్ని సూచిస్తూ జైపూర్ నగరం నవరాత్ర స్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 23వ తేదీ అంటే రేపు మంగళవారం జమ్మూ కశ్మీర్‌లో అన్ని బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఆ ప్రాంత చివరి పాలకుడు చక్రవర్తి మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా అక్కడ బ్యాంకులకు సెలవు ఇచ్చారు. హరి సింగ్‌ జయంతి సందర్భంగా పాఠశాలలతో పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జమ్మూ, శ్రీనగర్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు మంగళవారం మూసి వేసి ఉంటాయి.

బ్యాంకులకు సెలవు ఇచ్చిన సమయంలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు సేవల అంశంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అత్యవసర బ్యాంకు సేవల కోసం ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ను ఆశ్రయించవచ్చు. మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ ద్వారా బ్యాంకు సేవలను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.