మోడీ ప్రభుత్వం అందిస్తున్న 50 వేల రూపాయలు ఎలా పొందాలో తెలుసుకోండి…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం, ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి, పీఎం స్వానిధి యోజన (PM SWANidhi) పథకాన్ని మార్చి 31, 2030 వరకు పొడిగింపుకు ఆమోదం తెలిపింది.


ఈ పథకం మొత్తం వ్యయం రూ. 7,332 కోట్లు కాగా ఈ పథకం కింద 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులతో సహా 1.50 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేబినెట్ విడుదలలో పేర్కొంది.

UPI-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్ ప్రారంభం
ఈ స్కీంలో మొదటి విడత రుణాన్ని రూ. 10,000 నుండి రూ. 15,000కి , రెండవ విడత రుణాన్ని రూ. 20,000 నుండి రూ. 25,000కి పెంచారు, మూడవ విడత రూ. 50,000 వద్ద మారలేదు. UPI-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్ పరిచయం వీధి విక్రేతలకు ఏవైనా అత్యవసర వ్యాపార , వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి క్రెడిట్‌కు తక్షణ నగదును అందిస్తుంది. COVID-19 మహమ్మారి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం జూన్ 1, 2020న ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది.

PM SVANidhi యోజన అప్లికేషన్‌కి అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్
1. ఆధార్ కార్డు (తప్పనిసరి)
2. ఓటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్
3. ఆధార్ కార్డు/ రేషన్ కార్డు / ఎలక్ట్రిసిటీ బిల్ / గ్యాస్ బిల్ (అడ్రస్ ప్రూఫ్ కోసం)
4. బ్యాంక్ పాస్‌బుక్ / క్యాన్సెల్డ్ చెక్
5. వెండర్ ఐడి లేదా సర్టిఫికేట్ అర్బన్ లోకల్ బాడీ (ULB) ఇచ్చిన స్ట్రీట్ వెండర్ సర్టిఫికేట్,
6. స్థానిక మునిసిపాలిటీ/పట్టణ సంస్థ నుండి ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమండేషన్
7. పాస్ పోర్ట్ ఫోటో

ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి అటాచ్ చేయాలి.

PM SVANidhi యోజనలో ఇలా అప్లై చేయండి..
>> అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి www.pmsvanidhi.mohua.gov.in
>> Apply for Loan అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
>> మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డు వివరాలతో OTP వెరిఫికేషన్ చేయాలి.
>> ఇప్పుడు అప్లికేషన్ ఫాం ఫిల్ చేయండి
>> మీ పేరు, చిరునామా, ఆదాయం, స్ట్రీట్ వెండింగ్ వివరాలు తెలియజేయాలి
>> అవసరమైన డాక్యుమెంట్స్ (ఆధార్, వెండర్ ఐడీ / సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా వివరాలు) అప్‌లోడ్ చేయాలి.
>> మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ బ్యాంక్, మైక్రో ఫైనాన్స్ సంస్థను ను ఎంచుకొని, ఆన్‌లైన్‌లో ఫారమ్ సబ్మిట్ చేయాలి.
>> బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ అకౌంట్‌లో రూ. 10,000 వరకు ప్రథమ వర్కింగ్ క్యాపిటల్ లోన్ జమ అవుతుంది.
>> ఆ తర్వాత ఇంస్టాల్‌మెంట్స్ సకాలంలో చెల్లిస్తే, మీరు రూ. 20,000 – రూ. 50,000 వరకు పెరిగిన లోన్ లిమిట్ పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.