ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ ఏఐ కీలకంగా మారుతోంది. ప్రభుత్వం, ప్రయివేటు వ్యవస్థలు ఏఏఐకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రధాన రంగాల్లో ఇప్పటికే ఏఐ వినియోగం కీలక దశకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏఐకి ప్రత్యేకం గా గుర్తింపు ఇస్తున్నారు. దీంతో, ప్రముఖ విద్యా సంస్థలు సైతం ఏఐ కోర్సులకు వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా శిక్షణ.. బోధనలో మార్పులు తెస్తున్నాయి. ఇదే సమయంలో ఆన్ లైన్ ద్వారా ఏఐ తో పాటుగా ఎంఎల్ కోర్సులకు ఆన్ లైన్ శిక్షణ అందుబాటులోకి వచ్చింది.
ఏఐ, ఎంఎల్ కోర్సులకు శిక్షణకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, కొత్తగా ఆన్ లైన్ ద్వారా ఈ కోర్సుల్లో శిక్షణకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ద్వారా ఏఐ & ఎంఎల్, డేటా సైన్స్, బిగ్ డేటా కోర్సు లతో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజినీరింగ్ , డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చ. నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు వందకి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్ చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్ ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ కోర్సుల తో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదేనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు విద్యార్థులకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోందని వెల్లడించారు. దరఖాస్తుల కోసం ఆసక్తి గల అభ్యర్థులు Www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
































