గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఆరు రకాల బీమా పథ కాలను అమలుచేస్తోంది.
తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌లతో పాలసీదారులకు లాభాల భరోసాను ఇస్తోంది. సురక్ష, సువిధ, సుమంగళ్, సంతోష్, గ్రామప్రియ, చిల్డ్రన్ పాలసీ పేర్లతో ఆరు పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కో పథకం ద్వారా రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలు చేసుకునే అవకాశం కల్పించింది. వీటిలో ఒక్కో పథకానికి బోనస్‌ను రూ.60, రూ. 48, రూ.45 చొప్పున అందించనుంది. లబ్ధిదారుడు మూడేళ్లపాటు జరిపిన చెల్లింపులపై రుణసదు పాయం కల్పిస్తోంది. ప్రీమియం చెల్లిస్తున్న స మయంలో పాలసీదారుడు మృతిచెందితే చెల్లిం చిన పాలసీ మొత్తాన్ని ఒకేసారి నామినీకి అంద జేస్తారు. ఈ పథకాల్లో చేరదలిచినవారు ఆధార్, పాన్‌కార్డు కలిగి ఉండాలి. జిల్లాలోని ఏ పోస్టా ఫీసులోనైనా ప్రీమియం చెల్లించవచ్చు. ఆదాయ పు పన్ను రాయితీ, నామినేషన్ సదుపాయం, ఆ న్‌లైన్‌లో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని తపా లా శాఖ కల్పించింది. పోస్టల్ జిల్లా ఉన్నతాధికారి అందించిన సమాచారం మేరకు తపాలా శాఖలో వివిద పధకాల వివరాలు ఇలా ఉన్నాయి.
సంతోష్:
సంతోష్ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 55 మధ్య వయస్సు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. బోనస్ కింద రూ. 1000కి రూ48 వర్తిస్తుంది. 19 ఏళ్ల లబ్ధిదారుడు పథకంలో చేరితే మెచ్యూరిటీని 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లకు నిర్దేశించుకోవచ్చు. మెచ్యూరిటీ ఏ సంవత్సరం వరకూ అయితే నిర్ధేశించుకుం టారో.. ఆ సంవత్సరం నుంచి మరో ఐదేళ్లపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అనంతరం పాలసీ మొత్తానికి రూ.48లు బోనస్‌గా అదనంగా జోడి ంచి లబ్ధిదారుడికి అందజేస్తారు. రూ.10 లక్షల పాలసీ చేసిన లబ్ధిదారుడికి బోనస్‌తో కలిపి మొ త్తం రూ.29.68లక్షలు పాలసీ మొత్తం వర్తిస్తుంది.
సురక్ష:
సురక్ష పథకం కింద రూ.10 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 55 సంవత్సరాల మధ్య కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. బోనస్ కింద రూ. 1000కి రూ.60 వర్తిస్తుంది. 60 సంవత్సరాల వరకూ ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుం ది. అనంతరం 80 ఏళ్ల తర్వాత రూ.10 లక్షలు, అందుకు సంబంధించి రూ.60 బోనస్‌తో కలిపి మెచ్యూరిటీ మొత్తాన్ని లబ్ధిదారుడికి అందజేస్తా రు. లబ్ధిదారుడు మరణిస్తే ఆ మొత్తాన్ని నామి నీకి అందజేస్తారు. రూ.10 లక్షలు పాలసీ 60 సంవత్సరాల పాటు చెల్లిస్తే బోనస్‌తో కలిపి దా దాపు రూ.34.60 లక్షలు లబ్ధిదారుడికి అందజే స్తారు. మూడేళ్ల తర్వాత పాలసీదారుడు రుణ సదుపాయం కూడా ఉంటుంది.
గ్రామప్రియ:
ఈ పథకంలో 10 సంవత్సరాల పాలసీ మాత్రమే నిర్ణయించారు. ఇందులోని 20 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిని అర్హులుగా చేర్చారు. పథకంలో 10 సంవత్సరాల పాలసీలో మనీబ్యాక్ కింద 4,7 సంవత్సరాలకొకసారి 20 శాతం బోనస్ లభించనుంది. మిగిలిన మొత్తాన్ని పాలసీ ముగిసే సమయంలో బోనస్‌గా అద నంగా జోడించి అందంచనున్నారు.
సువిధ:
సువిధ పథకం కింద రూ.10 వేల నుంచి రూ. 10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని ఈ పథకానికి అర్హు లుగా చేర్చారు. ఈ పాలసీని సురక్ష పథకంలో మాదిరి 60 సంవ త్సరాల వరకూ నిర్ణయించుకోవచ్చు. లేదా సంతోష్ పథకంలో నిబంధ నల మేరకు కన్వర్ట్ చేసు కునే అవకాశం కల్పించారు. సురక్ష పథకం కింద ప్రీమియం చెల్లింపులు ఐదేళ్లపాటు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సంవత్సరంలోపు సంతోష్ పథకం కింద అయితే రూ.60 బోనస్.. సంతోష్ పథకం కింద కన్వర్ట్ చేసుకుంటే రూ.48 బోనస్‌గా లభిస్తుంది. లబ్ధిదారుడి చెల్లింపులు బట్టి బోనస్‌లు వర్తిస్తాయి.
సుమంగళ్:
ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ పాలసీలను నిర్ణయించారు. 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని ఈ పథకానికి అర్హులుగా చేర్చారు. ఈ పథకంలో రూ.45లు బోనస్‌గా లభిస్తుంది. పథకంలో రెండు రకాల బోనస్‌లను నిర్ణయిం చారు. 15 సంవత్సరాల నుంచి పాలసీను ఎంచు కున్న లబ్ధిదారుడికి మనీబ్యాక్ కింద 6 సంవత్స రాలకొకసారి, 9 సంవత్సరాలకొకసారి, 12 సంవ త్సరాలకొకసారి 20 శాతం మనీబ్యాక్ రూపంలో బోనస్ లభించనుంది. అనంతరం మిగిలిన బోన స్‌ను పాలసీ ఎంచుకున్న లబ్ధిదారుడికి మనీ బ్యాక్ కింద 8 సంవత్సరాలు, 12సంవత్సరాలు, 16 సంవత్సరాలకొకసారి 20 శాతం చొప్పున మనీబ్యాక్ రూపంలో బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఎలాంటి రుణసదుపాయం ఉండదు.
పిల్లల పాలసీ
ఈ పాలసీలో చేరే పిల్లలకు సంబంధి ంచిన తల్లిదండ్రులు, సురక్ష, సువిధ పథకాల్లో లబ్ధి దారులై ఉండాలి. ఆయా పథకాల్లో ఉన్న తల్లిద ండ్రుల పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. అది కూడా తల్లిదండ్రుల వయ స్సు 45లోపు ఉండాలి. ఈ పథకంలో 5 నుంచి 20 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు పాలసీ వర్తిస్తుంది. ఈ పథకంలో రూ.20 వేల నుంచి రూ.1లక్ష వరకూ పా లసీని నిర్ణయించారు. ఈ పథకంలో బోనస్ రూ.48గా నిర్ణయించారు.

































