గ్లామర్ టచ్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. అయినా ఓటీటీని ఊపేస్తోన్న సినిమా

ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఓటీటీలో ఎక్కడా చూసిన ఒక సినిమా పేరు మారుమోగుతుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు అంతగా పట్టించుకోని జనాలు.. ఇప్పుడు బ్రహ్మారథం పట్టారు. గ్లామర్ టచ్, స్పెషల్ సాంగ్స్ లేకుండానే ఓటీటీని ఊపేస్తోన్న సినిమా.. ఓటీటీలో ఈ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీల్లో కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు దూసుకుపోతున్నాయి. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఓటీటీలో సెన్సేషన్ అవుతుంది. నిజానికి ఈ మూవీ థియేటర్లలో వచ్చినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కన్యాకుమారి.


కన్యాకుమారి.. ఈ చిత్రానికి సృజన్ అట్టాడ దర్శకత్వం వహించగా.. ఆగస్ట్ 17న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంతగా రాణించలేకపోయింది. ఇటీవలే సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అయ్యింది.ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. స్టార్స్ లేకపోయినా అద్భుతమైన , ఎమోషనల్ కథతో దూసుకుపోతుంది. ఎలాంటి గ్లామర్ టచ్ లేకుండానే పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథకు ఇప్పుడు యూత్ తెగ అట్రాక్ట్ అవుతున్నారు. ప్రేమ, జీవితం, బ్రేకప్ వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇందులో గీత్ సైనీ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీచరణ్ హీరోగా నటించారు. రవి నిడమర్తి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీల్లో దూసుకుపోతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.