రైతులకు బంపర్‌ ఆఫర్‌.. భూ పత్రాలు లేకున్నా పీఎం కిసాన్‌ నిధులకు అర్హులు

కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రాష్ట్రంలోని రైతులకు భూపత్రాలు లేకున్నా వారికి పీఎం కిసాన్ నిధుల విడుదలకు సన్నద్ధమవుతుంది.


కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పీఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు పొందుతున్నారు. ఇది వారి వ్యవసాయ పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీనికి కచ్చితంగా భూ రికార్డులు కేవైసీ వంటివి పూర్తి చేసి ఉండాలి. కానీ బార్డర్ ప్రాంతాల్లో ఉండే రైతులకు భూ పత్రాలు లేకున్న వారికి 21వ విడత నిధులు విడుదలకు కేంద్ర సర్కారు సన్నద్ధం అవుతోంది.

ప్రతి ఏడాది రూ.6000 రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలో రూ.2000 చొప్పున విడుదల చేస్తారు. అయితే దీనికి సరైన భూ పత్రాలు, ఆధార్ కార్డు బ్యాంకుకు లింక్ అయి ఉండడం, కేవైసీ పూర్తి చేసుకోవడం వంటివి చేయాలి. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా బార్డర్ ప్రాంతాల్లో ఉన్న వరద ప్రాంతాల ప్రభావిత రైతులకు పీఎం కిసాన్ నిధి మొదటగా విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ లోనే మొదటి వారంలోనే దీనిపై రివ్యూ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో ఈ నిధులు ముందుగా విడుదల కానున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు భూ పత్రాలు లేకుండా ఈ నిధులు విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలతో బార్డర్ ప్రాంతంలో ఉన్న రైతులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే వరద ప్రభావితంతో వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. ఈ నిధుల విడుదలతో వారికి కాస్త ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంది. బార్డర్‌ ప్రాంతాల్లో చాలామంది రైతులు కొన్ని ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాళ్లకి సరైన పత్రాలు ఉండవు. ఈ పథకం ద్వారా ఈసారి పీఎం కిసాన్ పథకం యోజన వాళ్లు కూడా అందుకోనున్నారు.

ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన 21 విడుదల దీపావళికి ముందుగానే విడుదల చేయనున్నట్లు సమాచారం. కానీ అధికారికంగా వెబ్‌సైట్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఈ ఏడాది 21 నిధులు కూడా రూ.2000 విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 21వ విడత నిధులు దీపావళికి ముందుగానే విడుదలవ్వనున్నట్లు సమాచారం. 2025 అక్టోబర్ 17వ తేదీ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ పీఎం కిసాన్ నిధులు మంజూరు కావాలంటే ఆదాయపు పన్ను కట్టేవారు అర్హులు కాదు. అంతే కాదు పెన్షన్ నెలకు పదివేలకుపైగా తీసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. దీంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ మేయర్స్ కూడా ఈ పథకానికి అర్హులు కాదు. కిసాన్ నిధులు పొందాలంటే ముందుగానే బ్యాంకులో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. దీంతో పాటు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింకు చేసి ఉండాలి. ఇది ఆన్లైన్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. మీ అకౌంట్ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివ్ చేసుకొని ఉండాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకుని సదుపాయం కల్పించారు. ఆన్లైన్లో కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్ లో కూడా ఈ సదుపాయం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.