సీబీఎస్ఈ బోర్డు పరీక్షల డేట్ షీట్స్ విడుదల-తేదీలు ఇవే.

కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల బోర్డు పరీక్షల కోసం ఇవాళ టైం టేబుల్ విడుదల చేసింది. ఇందులో 10, 12 తరగతుల ప్రధాన పరీక్షలతో పాటు 12వ తరగతి స్పోర్ట్స్ విద్యార్ధులకు, 10వ తరగతి సెకండరీ బోర్డు పరీక్షలకూ, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకూ టైం టేబుల్స్ విడుదల చేశారు.


వీరికి బోర్డు పరీక్షల తేదీలతో పాటు ఇతర వివరాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి జూలై 15 వరకూ ఇవి జరుగుతాయి.

సీబీఎస్ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మన దేశంతో పాటు 26 దేశాలలో మొత్తం 204 సబ్జెక్టులలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో రాత పరీక్షలతో పాటు, ఫలితాలను సకాలంలో ప్రకటించడానికి ప్రాక్టికల్స్, మూల్యాంకనం, ఫలితాల తర్వాత ప్రక్రియలు కూడా ఉన్నాయి. సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సబ్జెక్టు పరీక్ష తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.

అలాగే 12 రోజుల్లోపు ఈ మూల్యాంకనం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉదాహరణకు 12వ తరగతి భౌతిక శాస్త్ర పరీక్ష ఫిబ్రవరి 20న జరిగితే మూల్యాంకనం మార్చి 3న ప్రారంభమై మార్చి 15 నాటికి ముగుస్తుంది. ఈ తేదీ షీట్లు తాత్కాలికమేనని సీబీఎస్ఈ తెలిపింది. పాఠశాలలు అభ్యర్థుల తుది జాబితాను సమర్పించిన తర్వాత తుది వెర్షన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. కాబట్టి విద్యార్ధులు సీబీఎస్ఈ విడుదల చేసే తుది జాబితా తర్వాత పరీక్షల తేదీల్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.