ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు

ఈ ఆధునిక యుగంలో మనిషికి తన శరీరం గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోడానికి కూడా సరైన సమయం ఉండటం లేదంటే ఆతిశయోక్తి కాదు.. ఇది నిజం. మన ఆరోగ్యం విషయంలో మనకు శరీరం ఎన్నో సూచనలు చేస్తుంది.


నిజంగా చెప్పండి వాటిలో మీరు ఎన్నింటిని ఇప్పటి వరకు గమనించారు. ఎవరితే శరీరం ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేస్తారో వారు జీవితంలో కచ్చితంగా రాసి పెట్టుకోండి గట్టి ఎదురుదెబ్బలు తింటారు. ఈ మాటలు ఎందరో వైద్య నిపుణులు చెబుతున్న మాటలు. ఇంతకీ ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం గురించి ఆలోచిస్తున్నారా.. ఏమై ఉంటుందని అనుకుంటున్నారు.. అదే ప్రాణాలు తీసే క్యాన్సర్. ఇంతకీ ఈ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

త్వరపడండి.. ప్రాణాలను కాపాడుకోండి..
ఒకప్పుడు క్యాన్సర్‌కు సరైన వైద్యం ఉండేది కాదు. కానీ కాలం మారింది. రోగాన్ని మొదటి దశలోనే గుర్తిస్తే అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ అనే ఆప్షన్స్‌తో రోగి ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు వైద్యులు. అందుకే ఎప్పుడు కూడా శరీరం ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే ఏంటంటే క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం ఎలా అనేది. మీరు ఉన్నట్లుండి బరువు తగ్గిపోతున్నారా. మీ రోజూ వారి జీవన శైలిలో ఎలాంటి ఆహార నియమాలు లేకుండా, ఏ మార్పులు చేయకుండా ఒకేసారిగా బరువు తగ్గిపోతే ఆలోచించకుండా వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని అంటున్నారు. ఈ వ్యాధి మొదట శరీరంలోని మెటబాలిజంలో మార్పులు తీసుకొస్తుందని, దీంతో శరీరం నుంచి ఎక్కువ శక్తి కోల్పోయి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆగకుండా బరువు తగ్గుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.

ఈ లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా?
ఆగకుండా దగ్గు రావడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా.. దగ్గుతో పాటు పాటు రక్తం వస్తే అది లంగ్ క్యాన్సర్‌కు సంకేతం అని అంటున్నారు వైద్యులు. సాధారణ జలుబు, దగ్గు నుంచి ఇది భిన్నంగా ఉంటుందని, దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ప్రత్యేకించి స్మోకింగ్ చేసేవాళ్లకు ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ ఎఫర్ట్ లేకుండా కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే అది లంగ్ క్యాన్సర్‌కు ఒక సంకేతమని, దగ్గుతో పాటు బ్లీడింగ్ రావడానికి TB వంటి సమస్యలు కావచ్చని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు.

పొట్ట నొప్పి, దీర్ఘకాల అజీర్తి, బవెల్ మూమెంట్స్ కష్టంగా ఉంటే అది క్యాన్సర్‌కు లక్షణం కావొచ్చని అంటున్నారు. ఈ లక్షణాలు స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. మలంలో రక్తం వంటి మార్పులు గమనిస్తే వెంటనే డాక్టర్‌తో మాట్లాడాలని చెబుతున్నారు. అలాగే యూరిన్‌లో రక్తం కనిపించడం కిడ్నీ లేదా బ్లాడర్ క్యాన్సర్‌కు సూచనగా పరిగణించాలని, యూరిన్‌లో బ్లడ్ రావడానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్‌ గడ్డలు చిన్నవిగా మొదలై క్రమంగా పెరుగుతూ ఉంటాయని, అవి నొప్పి లేకుండా ఉంటే మరింత ప్రమాదకరం అని అంటున్నారు. ఈ రకమైన గడ్డలు సాధారణంగా బ్రెస్ట్, మెడ, పొట్ట, ఇంటెస్టైన్స్ లేదా లివర్ వంటి శరీర భాగాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు. పొరపాటున ఇలాంటి లంప్స్ మీకు కనిపిస్తే అస్సలు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌తో చెక్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్ని గడ్డలూ క్యాన్సర్ అని చెప్పలేమని, కానీ అనుమానం వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలని మాత్రం సూచిస్తున్నారు.

వీటిని దూరం పెట్టండి.. రోగాన్ని తగ్గించుకోండి
కొన్ని ఈజీ మార్గాల ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్, పొగాకు, ఇతర అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు కాదు.. కచ్చితంగా వీటికి దూరంగా ఉంటే క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఫ్రూట్స్, కూరగాయలు, హోల్ గ్రైన్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‌తో పోరాడతాయని తెలిపారు. రెగ్యులర్ వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో క్యాన్సర్ రిస్క్‌ను తగ్గుతుందని, అలాగే మెడిటేషన్, యోగా వంటివి చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. పైన చెప్పిన లక్షణాల్లో మీకు ఏవి కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.