రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా నటుడిగా పవన్ కల్యాణ్ కొనసాగుతూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల హరిహర వీరమల్లుతో భారీ దెబ్బ తిన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు నడవడంతో ఓజీ సినిమా ఎలా ఉందనే వార్త బయటకు వచ్చేసింది. వీరమల్లు నుంచి తేరుకున్నట్టేనని.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగేనని అర్థమవుతోంది.
సాహో సినిమాతో పర్వాలేదనిపించిన సుజిత్ ‘ఓజీ’గా పవన్ కల్యాణ్‌తో సినిమా తీశాడు. షూటింగ్‌కు సమయం పట్టినా విడుదలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా థియేటర్‌లకు వదిలారు. 24వ తేదీ రాత్రి నుంచి స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన వారంతా ట్విటర్‌లో రివ్యూ పెడుతున్నారు. దాదాపుగా అందరూ సినిమా బాగుందనే చెబుతున్నారు. ఇప్పటివరకైతే ఫస్టాఫ్ అదిరిపోయిందని పోస్టులు చేస్తున్నారు.
































