బంగాళాఖాతంలో అల్పపీడనం!.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయంలోగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది.


శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నాయి. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.