సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. వైవీఎస్‌ చౌదరికి మాతృ వియోగం

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి (YVS Chowdary) మాతృమూర్తి రత్న కుమారి గురువారం రాత్రి కన్నుమూశారు.


గత కొంత కాలంగా వయోభారంతో బాధపడుతోన్న ఆమె తుది శ్వాస విడిచారు. వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వైవీఎస్.. నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ‘సీతారామరాజు’, మహేష్ బాబు కథానాయకుడిగా ‘యువరాజు’ సినిమాలను తెరకెక్కించారు. అనంతరం ‘బొమ్మరిల్లు’ నిర్మాణ సంస్థను స్థాపించి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారారు. ఆ తర్వాత సీతయ్య, దేవదదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరగా 2012లో గుణశేఖర్ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ‘నిప్పు’ సినిమాను వైవీఎస్ చౌదరి నిర్మించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.