ముంచుకొస్తోంది, బయటకు రావద్దు – ఈ ప్రాంతాల్లో మళ్లీ కుండపోత వానలు

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శనివారం) ఉదయానికి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తోంది.


దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ లో వాన వీడటం లేదు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ మోం అమలు చేయాలని పోలీసులు సూచించారు.

బంగాళాఖాతంలో వాయుగండం కారణంగా ఈ రోజు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నాయి. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. కాగా, శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి ముసురు వీడడం లేదు. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, ఫిల్మ్ నగర్ పంజాగుట్ట, అమీర్​పేట్​, ఖైరతాబాద్​, రాజేంద్రనగర్​, కిస్మత్​పూర్​, గండిపేట్​, అత్తాపూర్​, ఆరాంఘర్​, శంషాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి ప్రాంతాల్లో వర్షానికి తడుస్తున్నాయి. మరోవైపు కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్​, గుండ్లపోచంపల్లి, బహుదూర్​పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్​, షాపూర్​నగర్​, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్​, శంకర్​పల్లి, మోకిలలో వర్షం పడుతోంది. నల్గొండలోని తిరుమలసాగర్​లో 12.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జనగామలోని జాఫర్​గఢ్​లో 11 సెం.మీ. వర్షపాతం, ములుగు జిల్లా మేడారంలో 10.1 సెం.మీ. వర్షపాతం, నల్గొండ జిల్లా పులిచర్లలో 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్ష సూచన చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.