ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ వైద్యం చేయించుకుంటున్నారు.


అయినప్పటికీ జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో పవన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో ఈరోజు పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

అయితే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు పవన్. ఆ రోజు రాత్రి నుంచే ఆయనకు జ్వరం తీవ్రత పెరిగింది. దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం శాఖాపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది. కాగా.. నాలుగు రోజులు గడిచినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స చేయించుకునేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.