కాఫీ పేరు చెబితే గుర్తుకొచ్చే అంతర్జాతీయ బ్రాండ్ స్టార్బక్స్. ఇప్పుడీ సంస్థ కూడా వ్యయ నియంత్రణలో భాగంగా అమెరికాలో వందల కొద్దీ స్టోర్లను మూసివేస్తోంది.
ఖరీదైన స్టార్బక్స్ పానీయాలకు అమెరికాలో గిరాకీ తగ్గినందునే.. తగిన లాభాదాయాలు ఆర్జించని విక్రయశాలలను మూసివేస్తోందని సమాచారం. ఆయా శాఖల్లోని సిబ్బందిపైనా వేటు పడనుంది. ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారాన్ని పుంజుకునేలా చేసేందుకు బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ పథకానికి కంపెనీ ఆమోదం తెలపడం ఇందుకు నేపథ్యం.
మొత్తం అవుట్లెట్లలో ఈ నెలలోనే 1% మూత పడనున్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఉత్తర అమెరికాలో జూన్ చివరకు 18,734 స్టోర్లుండగా.. సెప్టెంబరు చివరకు ఇవి 18,300కు పరిమితం కానున్నాయి. మూతపడే స్టోర్లలోని 900 మంది వరకు ఉద్యోగులను తొలగించనుంది.




































