స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన ఎస్సై, విద్యుత్ కనెక్షన్ అప్‌గ్రేడేషన్‌కు డబ్బులు తీసుకుంటున్న జూనియన్ లైన్‌మన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఖమ్మం నగర వాసి మొండి బాలరాజు వద్ద 4 కార్లను అద్దెకు తీసుకున్న భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం విజయనగరం వాసి శ్యామల కృష్ణ.. అద్దె గానీ, ఆ కార్లు గాని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందుల పాల్జేస్తున్నాడు. దీంతో విసుగెత్తి అతడిపై మణుగూరు పోలీ్‌సస్టేషన్‌లో బాలరాజు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్‌కు రూ.40 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎస్‌ఐ రంజిత్‌పై శ్యామలకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ ఆధారాలను సమర్పించాడు.
ఏసీబీ అధికారుల విచారణలో రంజిత్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో శుక్రవారం ఎస్‌ఐ బత్తుల రంజిత్‌ను అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీజీఎ్‌సపీడీసీఎల్ గచ్చిబౌలి డివిజన్ వసంత నగర్ సెక్షన్.. ఎన్‌ఆర్‌ఎ్‌సఏ కాలనీ వాసి తన ఇంటి విద్యుత్ కనెక్షన్ 11కేవీకి అప్‌గ్రేడ్ చేయమన్నందుకు జూనియర్ లైన్‌మన్ శ్రీకాంత్ గౌడ్ రూ.30 వేలు డిమాండ్ చేస్తూనే తొలి విడతగా రూ.11 వేలు ఇవ్వమన్నాడు. శుక్రవారం బాధితుడి నుంచి రూ.11 వేలు లంచం తీసుకుంటున్న శ్రీకాంత్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి వరకూ వసంత్‌నగర్ సెక్షన్‌లో తనిఖీలు చేశారు.
































