హైబీపీతో బాధడుతున్న భారతీయులు- కంగారు పెట్టిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

భారత్లో హైబీపీ సైలెంట్ కిల్లర్లా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 21 కోట్ల మందికిపైగా ప్రజలను ఈ వ్యాధిని కుంగదీస్తోందని పేర్కొంది.


ప్రభుత్వాలు, ప్రజలకు ప్రాథమిక సంరక్షణ స్థాయిలో గుర్తింపు, చికిత్స, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా రక్తపోటుపై WHO ఈ మధ్య నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి చాలా వేగంగా ప్రబలుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 30-79 మధ్య వయసు ఉన్న భారతీయుల్లో ఈ వ్యాధి విస్తరిస్తోందని చెప్పింది. వీరిలో దాదాపు 30 శాతం మంది ఈ వ్యాధితో జీవిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 34 శాతం ఉంది. అంటే దాదాపు ప్రపంచస్థాయి సగటుతో సమానంగా ఈ వ్యాధి మన దేశంలో విస్తరిస్తోంది.

భారతీయుల్లో ఈ వ్యాధి ఎంతో వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రంగా ఉందని కూడా చెబుతోంది. 173 మిలియన్లకుపై భారతీయుల్లో వ్యాధి నియంత్రించలేని స్థితిలో ఉందని పేర్కొంది. ఇందులో 17 శాతం మందికి వ్యాధి నియంత్రణలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి చూసుకుంటే 1.4 బిలియన్ ప్రజలకు ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగానే గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, ఇతర వ్యాధులు వేగంగా వస్తున్నట్టు పేర్కొంది. ఇలా భారీ సంఖ్యలో బీపీతో బాధపడుతున్న రోగుల్లో ఐదుగురిలో ఒకరు మాత్రమే మందులు, జీవన శైలిలో మార్పులతో వ్యాధిని నియంత్రిస్తున్నారు. నియంత్రించలేని వాళ్లు లక్షల మంది అకాల మృతి చెందుతున్నారు. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో ఈ వ్యాధి కారణంగా ఆర్థికంగా చితికి పోతున్నట్టు పేర్కొంది. గత ఐదేళ్లులో 3.7 ట్రిలియన్ డాలర్లు ఆదాయం కోల్పోయినట్టు అంచనా వేసింది.

చాలా కాలంగా భారత్లో హైబీపీ కేసులో వస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విరుగుడు చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లుకుపైబడిన వారందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 2025 మధ్య నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 11.1 మిలియన్ల మందికి రక్తపోటు ఉన్నట్టు గుర్తించారు. 6.4 మిలియన్ల మందికిపైగా షుగర్ ఉన్నట్టు తేలింది. అందుకే దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వేగంగా చర్యలు తీసుకుంది. వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు, స్క్రీనింగ్లు, ఫాలోఅప్లు చేయడం వంటివి విస్తృతం చేశారు.

భారత్ మాత్రమే కాదు పొరుగున ఉన్న దేశాల్లో ఈ బీపీ సమస్య ఎక్కువగానే ఉంది. పాకిస్థాన్లో దాదాపు 42 శాతం మందికి ఈ వ్యాధి సోకింది. 34 మిలియన్ల మంది నియంత్రణలో లేని వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. భూటాన్, శ్రీలంక, నేపాల్లో అయితే ప్రపంచ సగటు కంటే ఎక్కువగానే రోగులు ఉన్నారు. అయితే బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో రక్తపోటు నియంత్రణ చర్యలు బాగున్నట్టు WHO పేర్కొంది. బంగ్లాదేశ్లో ఒకప్పుడు 15 శాతంగా ఉన్న నియంత్రణ రేటు ఇప్పుడు 56 శాతానికి చేరుకుంది. మిగతా దేశాలు కూడా ఇదే బాట పడుతున్నట్టు వెల్లడించింది.
నియంత్రణై WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ… రక్తపోటు నియంత్రణు మార్గాలు ఉన్నాయని అయితే దీనికి నిబద్ధత అవసరం అన్నారు. రాజకీయ నిబద్ధతతోపాటు వైద్యంపై పెట్టే ఖర్చు, ఆరోగ్యకరమైన వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రతి గంటకు వెయ్యి మందికిపైగా హైబీపీ వల్ల వచ్చే స్ట్రోక్లు, గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నియంత్రించవచ్చు.” అని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.