NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ – ‘దేవర 2’పై బిగ్ అప్డేట్ వచ్చేసింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా హై యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’.


2024, సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పార్ట్ 2పై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దేవర @ 1 ఇయర్

దేవర సినిమా రిలీజై శనివారానికి ఏడాది పూర్తి కాగా… ‘దేవర 2’పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘దేవర 2 కోసం రెడీగా ఉండండి’ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ‘ప్రతీ తీరాన్ని వణికిస్తూ విధ్వంసం తీరాలను తాకి ఏడాది అయ్యింది. ప్రపంచం గుర్తించుకునే పేరు ‘దేవర’. అది భయం అయినా, అది సంపాదించిన ప్రేమ అయినా ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు ‘దేవర 2′ కోసం సిద్ధం అవ్వండి.’ అంటూ రాసుకొచ్చారు. ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది.

దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌కు కూడా ఇదే ఫస్ట్ మూవీ. ఆయన నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. వీరితో పాటే ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యుయెల్ రోల్‌లో అదరగొట్టారు. పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా మూవీ రానున్నట్లు ముందే ప్రకటించారు.

తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు?

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అంటూ రాజమౌళి బాహుబలి టైంలో హైప్ క్రియేట్ చేయగా… ‘దేవర’ విషయంలోనూ డైరెక్టర్ శివ తండ్రి ‘దేవర’ను అమితంగా ప్రేమించే కుమారుడు ‘వర’ చంపినట్లు ఓ సన్నివేశం ఉంది. అలా ఎందుకు చేశాడు? అనేదే మిలియన్ మార్క్స్ క్వశ్చన్. దీంతో పాటే సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి? వారిని ఎవరు చంపారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలకు పార్ట్ 2లో ఆన్సర్ దొరకనుంది. ఈ క్రమంలో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ మూవీతో బిజీగా ఉన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.