LENIN : అయ్యగారి ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.


ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత పోర్షన్ షూటింగ్ కూడా చేసారు.

కానీ బాలీవుడ్ సినిమా కోసం లెనిన్ కు డేట్స్ ఇవ్వడంలో డిలే చేస్తుండడంతో ఆమెను ఈ సినిమా నుండి తప్పించి ఆ పోర్షన్ ను రీ షూట్ చేసారు మేకర్స్. శ్రీలీలతో కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే చేసారు. ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్స్ ని అఖిల్ సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది, చివరి షెడ్యూల్ ఈ నెలలో ప్రారంభమవుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్ ను అక్టోబర్ నాటికి ఫినిష్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబరు 17న లెనిన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.