రూ.1,51,370 జీతంతో ఏపీ ఎంఎస్ఆర్‌బీలో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు తీపికబురు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (APMSRB) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


రాష్ట్ర వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 538 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. మొత్తం 538 పోస్టులను భర్తీ చేయనుండగా.. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా అక్టోబర్ 3ను నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఖాళీలు..

538

విద్యార్హత..

సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. అలానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)లో రిజిస్టర్ అయి ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు అదనపు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు.

వయస్సు పరిమితి..

OC అభ్యర్థులు : గరిష్టంగా 42 సంవత్సరాలు

EWS/SC/ST/BC అభ్యర్థులు: గరిష్టంగా 47 సంవత్సరాలు

(PH/Ex-servicemen మొదలైనవి): గరిష్టంగా 50-52 సంవత్సరాలు

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగం ప్రకారం వేతనం ఉంటుంది.

కనిష్ట జీతం: రూ.61,960/-

గరిష్ట జీతం: రూ.1,51,370/-

ఎంపిక విధానం..

అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లేదా వ్రాత పరీక్ష ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసి తుది జాబితా విడుదల చేస్తారు.

దరఖాస్తు గడువు..

2025 సెప్టెంబర్ 11 నుంచి 2025 అక్టోబర్ 3 తేదీ వరకు

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్‌

దరఖాస్తు ఫీజు..

OC అభ్యర్థులు: రూ.1000/-

BC, SC, ST, EWS అభ్యర్థులు: రూ.750/-

దరఖాస్తు ఎలా చేయాలి..?

  • అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ఓపెన్ చేయాలి.
  • “Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు) అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ముఖ్య సూచనలు..

  • ఒకసారి సబ్మిట్ చేసిన దరఖాస్తులో మార్పులు చేయలేరు.
  • అభ్యర్థులు దరఖాస్తులో ఇచ్చే వివరాలు సరైనవిగా ఉండాలి.
  • వయస్సు, విద్యార్హత, రిజర్వేషన్ కేటగిరీ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి.
  • మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

ఈ నోటిఫికేషన్ రాష్ట్రంలో మెడికల్ సెక్టార్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతున్నందున, అర్హత కలిగిన వారు తప్పక దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.