గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల ఇల్లు.. గృహప్రవేశానికి ముందే కూల్చివేత

బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్‌ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్‌ వాలిపోయింది.


మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు.

రూ. కోటితో నిర్మాణం
వివరాలు.. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి పాలికె నుంచి అనుమతి తీసుకుంది. కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు.

ఇంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపునకు వాలిపోయింది. ఎప్పుడైనా కూలితుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దక్షిణ నగర పాలికె అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూలి్చవేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఈ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.