బంగారం ధర అడ్డు అదుపు లేకుండా ప్రతిరోజు పెరుగుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే పసిడి ధర మరింత బాగా పెరిగింది. బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని చెప్పవచ్చు.
బంగారం ధర ప్రతిరోజు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను 1.17 లక్షల రూపాయలు పలుకుతోంది. నిజానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 45 శాతం పెరిగింది. బంగారం ధర ప్రతిరోజు భారీగా పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ పతనం అవ్వడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర ఒక ఔన్స్ 3750 డాలర్లు పలుకుతోంది. ఇదే కనుక కొనసాగినట్లయితే బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారం ధర భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. అయితే బంగారం ధర భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ స్థాయి నుంచి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం సైతం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ తిరిగి మళ్ళీ పుంజుకున్నట్లయితే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఒకవేళ డాలర్ విలువ పుంజుకున్నట్లయితే బంగారం ధర కనీసం 10% నుంచి 20 శాతం మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీనికి తోడు జియో పొలిటికల్ పరిస్థితులు సద్దుమణిగినట్లయితే బంగారం ధర మరో 10 శాతం మీద తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర రాబోయే కాలంలో 20000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర మళ్ళీ లక్ష రూపాయలు దిగువకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీపావళి నాటికి ఈ పరిస్థితి వస్తుందా లేక రాదా అనేది తేడాల్సి ఉంది. మరోవైపు దీపావళి సందర్భంగా ధన త్రయోదశి పండుగ వేళ ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా పాటిస్తుంటారు.
అయితే ఈసారి ధన త్రయోదశి సందర్భంగా బంగారం ధరలు ఏకంగా లక్ష రూపాయలు పైకి చేరుకున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారిపోయింది అని చెప్పవచ్చు. అయితే దేశీయ పరిస్థితుల కన్నా అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారం ధరలను ఎక్కువగా శాసిస్తున్న నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































