డయాబెటిస్ బాధితులు ఏది తినాలన్నా సమస్యనే. డయాబెటిస్ బాధితులు మంచి పౌష్టికాహారం తినాలి అని చెప్తారు. ఇదే సమయంలో ఏది పడితే అది తినడం డయాబెటిస్ బాధితులకు మంచిది కాదని కూడా చెబుతారు.
కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినాలని చెబితే, మరి కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది కాదని సూచిస్తారు. ముఖ్యంగా జీడిపప్పు తింటే మంచిదని కొందరు అంటే జీడిపప్పు తినడం మంచిది కాదని మరికొంతమంది హెచ్చరిస్తారు.
మధుమేహంఉన్నవారు జీడిపప్పు గురించి తెలుసుకోవాలి
అసలు డయాబెటిస్ బాధితులు జీడిపప్పు తినవచ్చా? తినకూడదా? తింటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.డయాబెటిస్ బాధితులు జీడిపప్పును నిరభ్యంతరంగా తినవచ్చు కానీ జీడిపప్పులో ఉండే పోషకాలను, జీడిపప్పుతో ఉండే ఉపయోగాలను, ఇదే సమయంలో ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తీసుకోవలసిన జాగ్రత్తలను తప్పకుండా తెలుసుకోవాలి.
జీడిపప్పులో ఫుల్ పోషకాలు .. ఆరోగ్య ప్రయోజనాలు
జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ,ఐరన్ వంటి పోషకాలతో ఉండే జీడిపప్పును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీడిపప్పు తినడం వల్ల కండరాలకు శక్తి వస్తుంది. ఎముకలకు బలం చేకూరుతుంది.
జీడిపప్పుతో ఒత్తిడి నుండి ఉపశమనం
జీడిపప్పు తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుంది. జీడిపప్పు మన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. జీడిపప్పును తినడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు. పరిమిత మోతాదులో జీడిపప్పును తింటే మధుమేహంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే డయాబెటిస్ బాధితులు జీడిపప్పును మితంగా తీసుకోవాలి.
జీడిపప్పు ఇలా తింటేనే బెనిఫిట్
జీడిపప్పులో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ జీడిపప్పును మితంగానే తినాలి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటిస్ బాధితుల శరీరంలో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగవు. ఈ కారణంతో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా జీడిపప్పును తినకూడదు. పరిమితంగా తీసుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ బాధితులు జీడిపప్పును తినాలంటే వాటిని ఇతర గింజ ధాన్యాలతో, డ్రై ఫ్రూట్స్ తో కలిపి తినాలి. అది కూడా మితంగానే తీసుకోవాలి. ఇక వీరు అప్పుడప్పుడు జీడిపప్పును స్నాక్స్ గా తీసుకోవచ్చు.































