అబ్బాయిలు.. ల్యాపీ ఆలా వాడుతున్నారా.? పునరుత్పత్తిపై ఎఫెక్ట్.

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఈ సమయంలో కంఫర్ట్ కోసం ల్యాప్‌టాప్‌లను చాల రకాలుగా వాడుతున్నారు. అయితే ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా వినియోగిస్తే శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

ఇటీవల కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. దీంతో చాలామంది ఇంటి పని చేస్తూ ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే  కంఫర్ట్ కోసం కోసం  ల్యాప్‌టాప్‌ను ఎక్కువ సమయం ఒడిలో పెట్టుకొను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల చాల నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.


వర్క్ ఫ్రమ్ హోమ్‎లో ల్యాప్‌టాప్‌ ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని వాడితే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు . అలాగే రోజంతా ల్యాప్‌టాప్ వైఫైకి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌కి రేడియేషన్‌ కారణంగా మరింత నష్టం జరుగుతోంది. ల్యాప్‌టాప్‌ వల్ల చాలా అనర్థాల ఉన్నాయి.

పురుషులలో వంధ్యత్వం :  ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని పెట్టుకొను వాడటం  మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని కలుగుతుంది.  వేడి కారణం స్త్రీలలో గర్భాశయం సమస్యలు వస్తాయి. పురుషుల పునరుత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుంది. మగవాళ్లు ల్యాప్‌టాప్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని అధిక ఉష్ణోగ్రతస్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుంది.

వైఫై ద్వారా రేడియేషన్:  ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే వైఫై ద్వారా వచ్చే రేడియేషన్  చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి వస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరం. దీని కారణంగా నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

కండరాల నొప్పులు: వర్క్ ఫ్రమ్ హోమ్‎లో  ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని వాడటం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది కండరాలలో నొప్పికి దారితీస్తుంది. మీ ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా టేబుల్‌పై పెట్టుకొని పని చేయండి. ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.