మారిన జీవనశైలి.. జంక్‌ఫుడ్, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు తోడు నిద్రలేమి, శారీరక శ్రమ కొరవడటంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను రక్తపోటు, మధుమేహం చుట్టుముడుతున్నాయి. ఈ విషయం ఇటీవల ప్రభుత్వం చేసిన ఎన్సీడీ 3.0 సర్వేలో తేటతెల్లమైంది. రెండు జిల్లాల్లో అధిక రక్తపోటు, మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.
ఏం చేయాలంటే..
- 20 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి.
- పరగడుపున రక్తంలో గ్లూకోజు మోతాదు 100-125 మధ్యలో ఉంటే ముందస్తు మధుమేహంలోకి అడుగుపెట్టినట్లే.
- మధుమేహం నిర్ధారణ అయితే తొలిరోజు నుంచే వైద్యులు సూచించిన ఔషధాలు వినియోగించాలి.
- రోజూ వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవాలి.
జిల్లాలో స్క్రీనింగ్ లక్ష్యం: 17,71,424
ఇప్పటివరకు పూర్తి: 16,58,756
గుర్తించిన బాధితుల సంఖ్య
అధిక రక్తపోటు: 75,639
మధుమేహం: 63,424
రెండూ ఉన్నవారు: 92,019
నోటి క్యాన్సర్: 1
రొమ్ము : 1
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్: 1
































