స్కూళ్లలో 7,267 పోస్టులకు నోటిఫికేషన్..నెలకు రూ.2 లక్షల జీతం

టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ చేయనున్నారు.


టీచర్ పోస్టులతోపాటు స్కూళ్లలో ఇతర జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS Recruitment 2025) 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్‌లో ప్రిన్సిపల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 18 వేల నుంచి రూ.2 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు

ప్రిన్సిపల్ (225 పోస్టులు)

  • అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ, B.Ed.తో పాటు 8 నుంచి 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • జీతం: నెలకు రూ.2 లక్షలు

PGT (1460 పోస్టులు)

  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, B.Ed.
  • జీతం: ఆకర్షణీయ జీతం, ప్రయోజనాలు

TGT (3962 పోస్టులు)

  • అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, B.Ed., CTET అర్హత.
  • జీతం: మంచి జీతం
  • హాస్టల్ వార్డెన్ (635 పోస్టులు)
    • అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
    • జీతం: స్థిరమైన ఆదాయం

    ఫీమేల్ స్టాఫ్ నర్స్ (550 పోస్టులు)

    • అర్హత: B.Sc నర్సింగ్ లేదా సమాన అర్హత
    • జీతం: ఆకర్షణీయ వేతనం

    అకౌంటెంట్ (61 పోస్టులు)

    • అర్హత: కామర్స్/అకౌంట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
    • జీతం: మంచి జీతం, ఇతర ప్రయోజనాలు

    క్లర్క్ (JSA) (228 పోస్టులు)

    • అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్ నైపుణ్యాలు

     

    ల్యాబ్ అటెండెంట్ (146 పోస్టులు)

    • అర్హత: సైన్స్‌తో 10వ/12వ తరగతి ఉత్తీర్ణత
    • జీతం: ప్రభుత్వ ఉద్యోగ స్థాయికి తగిన వేతనం

    వయో పరిమితి

    • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
    • గరిష్ట వయస్సు: పోస్టుల వారీగా 55 సంవత్సరాల వరకు

     

    ఎంపిక ప్రక్రియ

    • పోస్టల ఆధారంగా ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు
    • ఆ తర్వాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు
    • ఇంటర్వ్యూ: అవసరమైతే నిర్వహించబడుతుంది
    • చివరికి ఆరోగ్య పరీక్ష తర్వాత ఎంపిక చేస్తారు

    ఎలా అప్లై చేయాలి?

    అర్హత గల అభ్యర్థులు nests.tribal.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, అక్టోబర్ 23, 2025 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.