వాల్నట్స్, బాదం జుట్టు ఆరోగ్యానికి కీలకం. వాల్నట్స్ తేమ, పోషణ ఇస్తే, బాదం బలం, మెరుపు ఇస్తుంది. రెండింటినీ ఆహారంలో కలిపితే జుట్టు బలంగా, దట్టంగా పెరుగుతుంది.
మీ జుట్టు బలంగా, పొడవుగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే మీరు తినే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కేవలం బయటి సంరక్షణ కాకుండా, లోపల నుండి సరైన పోషకాలు అందితేనే జుట్టు నిజంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్రమంలోనే గింజలు, ముఖ్యంగా వాల్నట్స్ (అఖ్రోటు) మరియు బాదం (అల్మండ్స్), జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవి అని నిపుణులు చెబుతున్నారు.
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు తలకు సహజంగా తేమను అందిస్తాయి. వీటి వల్ల స్కాల్ప్ పొడిబారకుండా, పొరలు ఊడిపోకుండా కాపాడబడుతుంది. వాల్‌నట్స్‌లో ఉండే బయోటిన్ మరియు విటమిన్ E జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా రాగి, జింక్ వంటి ఖనిజాలు జుట్టు సహజ రంగును కాపాడడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వాల్నట్స్ తినడం వలన రక్తప్రసరణ మెరుగుపడి, వేర్లకు ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది. ఇది కొత్తగా వచ్చే జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడుతుంది.
బాదం విటమిన్ E, మెగ్నీషియం, ప్రోటీన్లతో నిండిపోతుంది. విటమిన్ E యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి జుట్టును సూర్యరశ్మి మరియు కాలుష్యం నుంచి రక్షిస్తుంది. మెగ్నీషియం జుట్టు బలహీనతను తగ్గిస్తుంది, విరిగిపోకుండా కాపాడుతుంది. ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన మూలం. కెరాటిన్ సరిపడా ఉంటే జుట్టు మెత్తగా, సాఫ్ట్‌గా మరియు దట్టంగా ఉంటుంది. బాదం నూనెతో తలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి, వేర్లు బలపడతాయి.
మీకు తల చర్మం పొడిగా ఉంటే లేదా చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వాల్నట్స్ తీసుకోవడం మంచిది. అవి జుట్టుకు తేమ అందించి, రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. మీరు జుట్టు విరిగిపోవడం, చివరలు చీలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కుంటున్నట్లయితే బాదం బెటర్ ఎంపిక. అది జుట్టును మెత్తగా, మెరిసేలా చేసి, విరిగిపోకుండా చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్నట్స్ మరియు బాదం రెండింటినీ ఆహారంలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి వేర్వేరు కోణాల నుంచి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ లేదా స్మూతీలలో చేర్చుకోవచ్చు. అలాగే రోజూ 5-6 బాదం, 2-3 వాల్నట్స్ తినడం చాలుతుంది. వారానికి రెండు మూడు సార్లు వీటి నూనెలతో తలకు మసాజ్ చేయడం ద్వారా ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి.
జుట్టు అందంగా, పొడవుగా పెరగాలని కోరుకునే వారికి వాల్నట్స్, బాదం రెండూ తప్పనిసరి సూపర్‌ఫుడ్స్. వాల్నట్స్ జుట్టుకు పోషణ, తేమ అందిస్తే, బాదం బలాన్ని, మెరుపును ఇస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా ఆరోగ్యకరమైన, దట్టమైన జుట్టును పొందవచ్చు.
































